చలాచలబోధ సాంప్రదాయిక ఆశ్రమము, సాయి కైవల్యధామము నిర్మాణము
( పుట్టపర్తి లోని వెంగళమ్మచెరువు
గ్రామములోని జడ్ పి హైస్కూల్ వద్ద)
బాబా వారి నిర్దేశము
·
‘సాయికైవల్యధామము’
అనే కైవల్యాశ్రమ చలాచలబోధ సాంప్రదాయిక పీఠమును, పుట్టపర్తి క్షేత్రపరిధిలో ఏర్పరచమని భగవాన్
సత్యసాయి బాబా వారి నిర్దేశము.
·
తదనుగుణంగా
ఏర్పడిన ‘గురుచరణమ్ ట్రస్ట్, పుట్టపర్తి’ అధ్వర్యంలో, సాయి మంజునాథ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో
వారి అనుగ్రహముతో, భగవాన్ బాబా వారి ఆదేశముతో, స్వామి నిర్భయానందుల కృపతో చలాచలబోధ
సాంప్రదాయముగా “ సాయి కైవల్యధామము “
ఏర్పరచబడుచున్నది.
‘సాయికైవల్యధామము’
·
పుట్టపర్తి
నుండి నల్లమడ పోవు ఆర్ &
బి రహదారిపై వెంగళమ్మ చెరువు గ్రామ
పరిధిలోని జిల్లాపరిషత్ పాఠశాల ప్రక్కన గల ఎకరము స్థలమును “ సాయి కైవల్యధామము“
నిర్మాణమునకు తగినదిగా గుర్తించడమైనది.
·
చలాచలబోధ
సాంప్రదాయ గురువుల అనుగ్రహమునకు కేంద్రముగా, ఆశ్రయించిన సాధకుల ఆధ్యాత్మిక ఉన్నతి
లక్ష్యంగా ఈ ‘సాయికైవల్యధామము’ విశ్వవ్యాప్తముగా అందరికీ అందుబాటులో ఉండును.
అన్ని కార్యక్రమములు ఎటువంటి లాభాపేక్ష లేకుండా జరుగును.
·
ఇందులో
ప్రధాన ఆలయం, ఉపాలయములు, గురు నివాస్, యాగ శాల, అధిష్టానము & ధ్యాన మందిరము, కిచెన్, మల్టీ పర్పస్ హాలు (డైనింగ్ & డోర్మిటరీ), వాష్ రూమ్స్ , బోర్ వెల్, కరెంట్ ట్రాన్సుఫార్మర్, సెప్టిక్ టాంక్ & డ్రెయినేజ్
ఏర్పాటవ్వవలసి ఉన్నది.
·
నవంబర్
21, 2024
గురువారం ఉదయం 9 గంటల 15 నిమిషాలకు
(క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసము, బహుళపక్షం, షష్టి, పుష్యమి నక్షత్రము) ‘సాయికైవల్యధామము’
నిర్మాణము శంకుస్థాపన జరిగినది.
‘సాయికైవల్యధామము’ నిర్మాణమునకు గాను ద్రవ్య యజ్ఞము
· ఈ నిర్మాణము గురుచరణమ్ ట్రస్ట్, పుట్టపర్తి అధ్వర్యములో సత్సంగ సభ్యులు అందించు విరాళములతో జరుగును. ప్రస్తుతము నిర్మాణపు పనులు జరుగుచున్నవి. నిర్మాణమునకు గాను ద్రవ్య యజ్ఞంలో పాల్గొని వితరణ చేయగోరు దాతలు ఈక్రింద ఇవ్వబడిన ఆశ్రమము బ్యాంక్ అకౌంటుకు చెల్లింప మనవి. ద్రవ్య వితరణ తదుపరి విరాళము/దాత వివరములు మానేజింగ్ ట్రస్టీ గారికి పంపిన మీ విరాళమును ధృవీకరించి తగు రసీదును అందించెదరు.
·
మనందరమూ
వితరణ చేసే ద్రవ్య యజ్ఞం సద్వినియోగము చేయబడుతుంది. సాంప్రదాయముగా సనాతనధర్మం
రోజువారీ దైనందిన జీవనములో ఆచరించవలసిన ఐదు యజ్ఞాలు – దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. చలాచలబోధ సాంప్రదాయమున పరమాత్మచే
భగవద్గీత యందు చెప్పబడిన సాధనపూర్వకమైన పంచయజ్ఞాలకు (జపయజ్ఞం, తపోయజ్ఞం , స్వాధ్యాయయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, జ్ఞానయజ్ఞం) ప్రాధాన్యత ఇవ్వబడింది.
·
నెలవారీగా
ఎవరైనా ఎంతో కొంత 1000, 5000, 10000 రూపాయల ద్రవ్యం వితరణ చేద్దాం అనుకుంటే చేయవచ్చును. కొందఱు ద్రవ్యసంబంధ యజ్ఞములను మరికొందరు
తపోరూపయజ్ఞములను, కొందఱు యోగరూపయజ్ఞములను చేయుదురు. మరికొందరు
స్వాధ్యాయ యజ్ఞములను జ్ఞానయజ్ఞములను ఆచరించుచున్నారు. కావున వీటియందు యధాశక్తి పాల్గొనగలరని మనవి.
‘సాయికైవల్యధామము’ నిర్మాణము ప్రణాళిక
మంగళమ్ మహత్
x